ఏబీవీపీ తలపెట్టిన ఇంటర్ బోర్డు ఉద్రిక్తంగా మారింది. అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కార్పొరేట్, ప్రైవేట్ జూనియర్ కళాశాలలపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి పరిషత్ (ABVP) నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు.
ఆందోళనకారులు ఒక్కసారిగా ఇంటర్ బోర్డు కార్యాలయంలోకి దూసుకెళ్లేందుకు తీవ్రంగా యత్నించారు. ముందస్తు సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఏబీవీపీ నాయకులను కాంపౌండ్ గేటు వద్దే నిలువరించారు .
ఈ క్రమంలోనే ఇరువర్గాల మధ్య తీవ్ర తోపులాట,. ప్రభుత్వానికి, బోర్డు అధికారులకు వ్యతిరేకంగా విద్యార్థి నేతలు పెద్దెత్తున నినాదాలు చేశారు.
పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులను బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి, అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
