ప్రైవేట్ కళాశలలా ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ను కోరారు.శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నివాసంలో కలిసి మాట్లాడారు.
గత రెండు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరడం జరిగింది. అందుకు మహేష్ కుమార్ గౌడ్ వెంటనే స్పందించి సాధ్యమైనంత త్వరలో విడుదల చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ యూనివర్సిటీ ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంబోజి హరిప్రసాద్, అధికార ప్రతినిధి అరుణ్ కుమార్, సుజన్ రెడ్డి, మిగతా యాజమాన్య ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది.
