సామజిక సేవ సంస్థ లో పనిచేస్తున్న హిజ్రా ఇంటి మీద ఓ అల్లరి మూక దాడి చేసింది. నగరంలోని దుబ్బా ప్రాంతంలో స్నేహా సొసైటీ లో హిజ్రా శ్యామల ఆమె సహచరుడు పనిచేస్తున్నారు.
అదే సంస్థ లో పనిచేస్తున్న యువకుడి తో పని విషయంలో తగాదా జరిగింది. దీనితో ఆటో నగర్ ప్రాంతానికి చెందిన పది మంది యువకులను వెంటేసుకొని వచ్చి శ్యామల ఇంట్లోకి చొరబడి చితకబాదారు. అల్లరి మూకల దాడి బాధితురాలు మూడో టౌన్ లో పిర్యాదు చేసారు.
