ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు బిఆర్ శివప్రసాద్ మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ పోలీస్ వ్యవస్థను వారి అనుకూలంగా మలుచుకుని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన దాడి చేయడం హేమమైన చర్య
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీలో కార్యకర్తలు పార్టీ కార్యాలయాన్ని దేవాలయంగా భావిస్తారని ఆ దేవాలయం పైనే దాడి చేస్తే కార్యకర్తల యొక్క ఆవేదనను అర్థం చేసుకోవాలని ముఖ్యంగా ఈ చర్యకు పాల్పడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని నిరసన చెప్పే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది కానీ ఇలా దాడి చేయడం చాలా బాధాకరం.
ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్లు మల్లేష్ యాదవ్, ఇప్పాకాయల కిషోర్, ముత్యాలు, బాలకృష్ణ, దేవర్ సంజీవ్, కెప్టెన్ రాజు, గిరి వర్ధన్ తదితరులు పాల్గొన్నారు.
