తన కిడ్డీ బ్యాంకు లో కూడబెట్టిన నగదు తో అయిదేళ్ల ఓ చిన్నారి హెల్మెట్ లను బహుకరించింది. అదికూడా తన అయిదో జన్మ దినం రోజే.
నగరంలో సీఐసీ కాలనీ కి చెందిన సంధి అద్విక తన కిడ్డీ బ్యాంకు లో దాచుకున్న నగదు ను సామాజిక ప్రయోజనాల కోసం వెచ్చించాలని ఆలోచనతో తల్లీ మౌనిక బెన్ని తండ్రి ల సూచన మేరకు 60 హెల్మెట్ లను కొనుగోలు చేసింది.
ఆ హెల్మెట్ లను నిరుపేదలకు మంగళవారం తన జన్మదినం రోజు ట్రఫిక్ ఏసీపీ మస్తాన్ అలీ సీఐ ప్రసాద్ ల చేతుల మీదుగా పంపిణీ చేసింది.
రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా ముందు జాగ్రత గా హెల్మెట్ లు ధరించాలనే పోలీస్ లు చెప్పే సూచన మేరకేతమ కూతరు హెల్మెట్ లను వితరణ చేసిందని తండ్రి బెన్ని అన్నారు.
చిన్నారి ఔదార్యం ను రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ నుడా ఛైర్మెన్ కేశ వేణు సీనియర్ నేత రత్నాకర్ లు వచ్చి అభినందించారు
