HomeTelanganaHyderabadజిల్లా, నగర కాంగ్రెస్‌ మైనారిటీ చైర్మన్‌ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం.

జిల్లా, నగర కాంగ్రెస్‌ మైనారిటీ చైర్మన్‌ పదవులకు దరఖాస్తుల ఆహ్వానం.

ఏఐసీసీ, టీపీసీసీ ఆదేశాల మేరకు నిజామాబాద్‌ జిల్లా మరియు నగర కాంగ్రెస్‌ మైనారిటీ డిపార్ట్‌మెంట్‌ చైర్మన్‌ పదవుల ఎంపిక ప్రక్రియ ఈ నెల 25న (సోమవారం) నిర్వహించనున్నట్లు నిజామాబాద్‌ అర్బన్‌ డీసీసీ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ ఎన్నిక ప్రక్రియను పర్యవేక్షించేందుకు జిల్లా మైనారిటీ సెల్‌ పరిశీలకులు మహమ్మద్‌ మోయిన్‌ సోమవారం నిజామాబాద్‌కు విచ్చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఈ పదవులపై ఆసక్తి ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఉదయం 11:00 గంటల నుండి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయానికి (డీసీసీ ఆఫీస్‌) విచ్చేసి, తమ పూర్తి బయోడేటా వివరాలతో కూడిన దరఖాస్తులను పరిశీలకులకు సమర్పించాలని కోరారు.

నిర్దేశిత సమయంలోగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల వివరాలను పరిశీలించి తదుపరి నిర్ణయం తీసుకుంటారని ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments