విద్యుత్ ఘాతానికి గేద మృతి చెందిన ఘటన నగరంలోని అమ్మ వెంచర్ లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్లితే నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మ గుట్ట కు చెందిన ఓడ్డెన్న రోజు లాగే గేదెల్ని మేపడానికి వెళ్ళగా అక్కడ విద్యుత్ తీగ తెగిపబడి ఉంది.
ఈ క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతం చెంది గేదే మృతి చెందినట్లు తెలిపారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి తీగ తెగిపడి ఉందని స్థానికులు చెబుతున్నారు.
స్థానిక నివాసితులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన పట్టించుకోకపోవడం వల్లనే ఈ అఘాయిత్యం జరిగిందని స్థానికులు తెలిపారు.
