నిజామాబాద్ నగరంలోని ఓ వ్యక్తి మద్యం మత్తులో 100 కు డయల్ చేయగా శుక్రవారం జిల్లా సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు మూడు రోజులు జైలు శిక్ష విధించినట్లు నాలుగవ టౌన్ ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
వివరాల్లోకి వెళితే నిజామాబాద్ నగరంలోని 4 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎల్లమ్మ గుట్ట కు చెందిన ఆఫ్రోజ్ (32) అనే వ్యక్తి గత మద్యం మత్తులో అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నెంబర్ కు కాల్ చేస్తూ న్యూసెన్స్ చేశాడు.
ఈ మేరకు వ్యక్తిని శుక్రవారం మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా విచారించిన మెజిస్ట్రేట్ అఫ్రోజ్ కు మూడు రోజులు జైలు శిక్ష విధించారు.
అత్యవసర సమయంలో ఉపయోగించవలసిన డయల్ 100 నంబర్ ను దుర్వినియోగం చేయకుండా ఆపదలో ఉన్నవారికి సహాయ పడే విధంగా
ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని ఎవరు కూడా అనవసరంగా పోలీసు వారిని ఇబ్బంది పెట్టాలని పలుమార్లు చేసినట్లయితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు.
