రాష్ట్ర రైతు కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ గురువారం ముంబయిలోని ప్రసిద్ధ లాల్‌బాగ్‌చా రాజా వినాయకుడిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని ఆయన ఆకాంక్షించారు. రైతులకు మంచి దిగుబడులు లభించి, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరియాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
అనంతరం లాల్‌బాగ్ ట్రస్ట్ చైర్మన్ బాలాసాహెబ్ తామ్రే గడుగు గంగాధర్‌ను సత్కరించి ప్రత్యేక పుస్తకాన్ని అందజేశారు.
