గచ్చిబౌలి శుక్రవారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం లో ఇద్దరు మృతి చెందారు . రాజస్థాన్ కు చెందిన టైల్స్ కార్మికులు కనైయాలాల్ (25), దేరామ్ (24) కారులో ఇంద్రారెడ్డి నగర్ నుంచి నానక్‌రామ్‌గూడ వెళ్తున్నారు.
కారు అదుపుతప్పి నియోపొలిస్ వద్దనున్న బ్రిడ్జ్ పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. .
