నగరంలోని నయా బిడ్జి వద్ద ఆదివారం రాత్రి కత్తిపోట్లు జరిగాయి. ఆరో టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోనగర్ లోని నయా బిడ్జి కి చెందిన అక్బర్ అదే ప్రాంతానికి చెందిన తన సమీప బంధువు అయినా మహిళా ను ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ సాథ్ ఫారూఖీ ముగ్గురు స్నేహితులతో కలిసిఅక్బర్ ఇంటికి వెళ్ళాడు.
ఆదివారం రాత్రి ఇదే విషయంలో ఇద్దరి మధ్య విషయంలో మాట మాట పెరిగింది. దీనితో రెచ్చి పోయిన అక్బర్ ఇంట్లోకివెళ్ళి కత్తి తెచ్చి ఫారూఖీ ఫై దాడి చేసాడు.
కడుపు భాగంలో కత్తి పోట్లు కావడంతో అతని కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు
