Saturday, April 18, 2026
HomeCRIMEశ్రద్ధానంద్ గంజ్ లో వ్యక్తి ఆత్మహత్య..

శ్రద్ధానంద్ గంజ్ లో వ్యక్తి ఆత్మహత్య..

నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ లో గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన నగరంలోని మూడవ టౌన్ పరిధిలో చోటుచేసుకుంది.సి హరి బాబు తెలిపిన వివరాల ప్రకారం..

నిజామాబాద్ నందు తేదీ 25-08-2025 ఉదయం గoజ్ నిజామాబాద్ యందు ఒక గుర్తు తెలియని మగ వ్యక్తి ఊరి వేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. అతని వయసు సుమారు 35నుండి 40 ఉంటుంది .

అతని పైన బట్టలు స్కై బ్లూ రంగు టీ షర్టు,నేవీ బ్లూ రంగు ప్యాంట్ వ్యక్తి వాలకం బట్టి కూలి పని చేసుకునే వ్యక్తిగా కనబడుతున్నట్లు తెలిపారు. ఇతని యొక్క జేబులు చెక్ చేయగా అతని జేబులో ఎటువంటి ఆధారాలు దొరకలేదన్నారు.

స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ యందు భద్రపరిచినట్లు తెలిపారు.

మృతుని వివరాలు తెలిసిన వారు 3 టౌన్ పోలీస్ స్టేషన్ 8712659839.8712551734 ఫోన్ చేసి సమాచారం అందించాలని ఎస్ఐ హరిబాబు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments

error: Content is protected !!