2025-26 విద్యా సంవత్సరానికి గాను నిజామాబాద్ జిల్లాలో ఫిబ్రవరి మార్చి నెలలో నిర్వహించిన వార్షిక పరీక్షలలో జనరల్ విభాగంలో రెండవ సంవత్సరం విద్యార్థులు 66.19% ఉత్తీర్ణత సాధించారు. కాగా మొదటి సంవత్సరం విద్యార్థులు 56.64% ఉత్తీర్తో సాధించారు. అలాగే జిల్లాలో ఒకేషనల్ విభాగంలో రెండవ సంవత్సరంలో 67.68% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
ఒకేషనల్ మొదటి సంవత్సరం లో 49.65% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. జిల్లాలో ఫిబ్రవరి, మార్చ్ నెలలో నిర్వహించిన ఇంటర్ వార్షిక పరీక్షలలో మొత్తం రెండవ సంవత్సరం జనరల్ విద్యార్థులు మొత్తం 13,876 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 9,187 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
వీరిలో బాలికలు 7,606 మంది పరీక్షలకు హాజరుకాగా 5,823 మంది బాలికలు ఉత్తీర్ణత కాగా 76.56% శాతం తో బాలుర పై చేయి సాధించారు.రెండవ సంవత్సరం బాలురు 6 ,273 మంది విద్యార్థులు హాజరు కాగా వీరిలో 3,364 మంది విద్యార్థులు పాసై 53.63% సాధించారు.
మొదటి సంవత్సరం జనరల్ విభాగంలో మొత్తం విద్యార్థులు 15,547 మంది పరీక్షలకు హాజరు కాగా 8,806 మంది విద్యార్థులు పాస్ కాగా 56.64% సాధించారు. వీరిలో బాలికలు 8,711 మంది పరీక్షలకు హాజరుకాగా వీరిలో 5,868 మంది బాలికలు ఉత్తీర్ణులై 67.36% పాస్ సాధించారు.
అలాగే మొదటి సంవత్సరం జనరల్ బాలురు 6,836 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 2,938 మంది ఉత్తీర్ణులై 42.98% పాస్ సాధించారు.ఒకేషనల్ విభాగం….జిల్లాలో ఒకేషనల్ విభాగంలో మొత్తం రెండవ సంవత్సరం విద్యార్థులు 2,345 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 1,587 మంది విద్యార్థులు పాసై 67.68% ఉత్తీర్ణత సాధించారు.
వీరిలో బాలికలు1,002 పరీక్షలకు హాజరు కాగా, 843 మంది బాలికలు పాసై 84.13% సాధించారు. అలాగే బాలురూ 1,343 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 744 మంది ఉత్తీర్ణులై 55.40% సాధించారు.ఒకేషనల్ మొదటి సంవత్సరం విద్యార్థులు మొత్తం 2,562 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 1,272 మంది విద్యార్థులు పాసై 49.69% సాధించారు.
వీరిలో బాలికలు 1,096 మంది పరీక్షలకు హాజరు కాగా 789 మంది పాసై 71.99% సాధించారు. అలాగే బాలురు 1,466 మంది పరీక్షలకు హాజరుకాగా 4 l83 మంది బాలురు పాసై 32.95% సాధించారు.
గత సంవత్సరం కన్నా పెరిగిన ఉత్తీర్ణత శాతం….2024_25 విద్యా సంవత్సరంలో రెండవ సంవత్సరం లో 58.21% ఉత్తీర్ణత సాధించగా 2025_26 విద్యా సంవత్సరంలో 66.19% ఉత్తీర్ణత సాధించారు.
అలాగే మొదటి సంవత్సరంలో 2024_25 విద్యా సంవత్సరంలో 53.37శాతం ఉత్తీర్ణత సాధించగా 2025_26 విద్యా సంవత్సరంలో 56.64% ఉత్తీర్ణత సాధించారు.
