HomeTelanganaNizamabadరెండు రోజులు వర్ష సూచన....పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్...

రెండు రోజులు వర్ష సూచన….పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్…

తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమ మంగళవారాల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఈ నేపథ్యంలో ఆయా జిల్లాల్లోని అధికారులను ప్రభుత్వం అప్రమత్తం చేసింది.ముఖ్యంగా భారీ ఈదురు గాలులతో కూడిన వర్షం పడే ఛాన్స్ వుందని వారు చెప్తున్నారు . భారీ హోర్డింగులు, పెద్ద వృక్షాల వద్ద నిలబడవద్దని ప్రజలకు సూచించింది.

అవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని ప్రజలకు స్పష్టం చేసింది.హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో గంటకు 40 కిలోమీటర్ల వేగంగా ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. ఉరుము మెరుపులతో వర్షాలు కురుస్తాయని వివరించింది.


అలాగే కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకశం ఉందని తెలిపింది. దీంతో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించింది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments