ప్రభుత్వం ఎట్టకేలకు రైతులకు తీపి కబురు అందించింది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న రైతు భరోసా నిధులు ఫై ఎట్టకేలకు ఉత్కంఠ కు రేవంత్ సర్కార్ తెరదించింది.ఉగాది పండగ కనుక గా రైతు భరోసా నిధులు మంజూరు చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తుంది సోమవారం నుంచి రైతు ఖాతాల్లో ఈ నిధులు విడతల వారీగా జమ చేయబోతుందిఉగాది) నుండి అర్హులైన రైతుల ఖాతాల్లో జమవుతున్నాయి.
ప్రభుత్వం ఈ విడతలో ఎకరం వరకు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో నిధులను, అలాగే కొత్త పట్టాదారు పుస్తకాలు పొందిన రైతులకు లబ్ధి చేకూరునుంది.తు భరోసా కోసం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు.
నిజామాబాద్ జిల్లాలో 2,60,617 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరికి రూ.230 కోట్లకు పైగా రైతుభరోసా నిధులు రావాల్సి ఉంది. ఇక, కామారెడ్డి జిల్లాలో 2.96 లక్షల మంది రైతులు ఉండగా, వీరికి రూ.246 కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందాల్సి ఉంది.
సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇవ్వాల్సిన ప్రభుత్వ సాయం ఫిబ్రవరి వచ్చినప్పటికీ ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాట్లు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల కోసం రైతులు అప్పులు చేశారు. ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.
అయినప్పటికీ సర్కారు స్పందించక పోవడంతో వారి ఆశలు అడియాసలవుతున్నాయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా రెండుసార్లు మాత్రమే రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో ఈ గందరగోళం ఏర్పడింది.
ప్రస్తుత యాసంగికి సంబంధించి సెప్టెంబర్ మాసంలో వేయాల్సిన పెట్టుబడి సాయం ఫిబ్రవరి ముగింపుకొస్తున్నా వేయకపోవడంపై రైతాంగంలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నార్లు పోసే సమయానికి రావాల్సిన పైసలు నాట్లు వేసి నెలలు గడుస్తున్నా రాకపోవడంపై అసహనం వ్యక్తం అయింది.
యంపిటిటి జెడ్పిటిసి ఎన్నికల నేపథ్యంలో నిధులు ఇస్తారని భావించారు కానీ నిధులు సర్దుబాటు కాక పోవడంతో ప్రబుత్వం ఆ ఎన్నికల కే దూరంగా ఉంది.
