సొసైటీ ఫర్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన “తెలంగాణ రన్ –2026” కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సొసైటీ ప్రధాన కార్యదర్శి మగ్గరి శ్రీనివాస్ తెలిపారు.
ఆదివారం ఉదయం 5.30 గంటలకు జిల్లా కేంద్రంలోని పాత కలెక్టరేట్ మైదానం నుంచి తెలంగాణ రన్ ప్రారంభం అవుతుందని, ప్రధాన మార్గాల మీదుగా కొనసాగి తిరిగి కలెక్టరేట్ మైదానంకు చేరుకుంటుందని అన్నారు. 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల విభాగాల్లో రేసులు నిర్వహించనున్నట్లు తెలిపారు.
తెలంగాణ రన్ ను జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు.ఆరోగ్యం, ఫిట్నెస్, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెంపొందించడంతో పాటు తెలంగాణలో రన్నింగ్ సంస్కృతిని ప్రోత్సహించే లక్ష్యంతో ఈ పరుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రకృతి వైవిధ్యం, పర్యాటక ప్రదేశాలను ప్రజలకు పరిచయం చేయడం కూడా ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు.ఈ రన్లో విద్యార్థులు, యువత, ఉద్యోగులు అన్ని వర్గాల వారు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
