ఇక రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి నూకలు చెల్లాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీ జిల్లా నూతన అధ్యక్షుడుగా నియామకం అయిన నగేశ్ రెడ్డి,నగర అధ్యక్షుడుగా ఎన్నికైన బొబ్బిలి రామకృష్ణ కు నియామకం అయ్యారు.
ఈ సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రం లోని కాంగ్రెస్ భవన్ లో వారు బాధ్యతలు స్వీకరించారు.నూతనంగా ఎన్నికైన జిల్లా అధ్యక్షుడు, నగర అధ్యక్షులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నగరంలోని ఓ కళ్యాణ మండలంలో ఏర్పాటు చేసిన సమావేశంలోనే పిసిసి అధ్యక్షుడు మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధ న పేరుతో నాడు కేసీఆర్ చేసిన దీక్ష ఒక నాటకమని వ్యాఖ్యానించా రు. ఇప్పుడు బీఆర్ఎస్ ఉనికిని చాటుకు నేందుకు కోట్లాది రూపాయల ఖర్చుతో దీక్షా దివస్ పేరుతో ఆ నాటకాన్ని రక్తి కట్టించేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు.
ఆ రోజున కేసీఆర్ చేసిన దీక్ష వల్ల తెలంగాణ రాలేదని, సోనియాగాంధీ వల్ల రాష్ట్రం వచ్చిందన్నారు. ఆనాడు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రిగా, కేటీఆర్, హరీష్ రావు, కవితలకు పదవులు వచ్చేవా అని ప్రశ్నించారు.
దీక్ష దివాస్ చేసిన మాజీ ఎమ్మెల్యేకు జిల్లాలో ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. అలాగే బీసీ రిజర్వేషన్ల పై ఎంతో శ్రమించి తీసుకువస్తే బీజేపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. బీజేపీ నేతలకు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో డిపాజిట్ కూడా దక్కలేదని ఎద్దేవ చేశారు.
ఇక రాబోయే రోజుల్లో బీజేపీ కి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ భవిష్యత్తు లేదని పేర్కొన్నారు. జరగబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తలే విజయం సాధిస్తారని పేర్కొన్నారు. ఈ ఈ పాటికే పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అభివృద్ధికి ప్రజలు ఆకర్షితులై పలువురిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని తెలిపారు.
ఇక జిల్లా అభివృద్ధి కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు అన్నారు. ఎన్నికల్లో పేర్కొన్న హామీలు,ఆరు గ్యారంటీలు ప్రభుత్వం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే జిల్లాకు 35 ఏళ్ల కళ అయిన ఇంజనీరింగ్ కళాశాల తీసుకువచమని పేర్కొన్నారు.
అదే విధంగా తన స్వగ్రామంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం 11 ఎకరాలు దానం చేసినట్లు తెలిపారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధ్యక్షులకు అభినందనలు తెలిపారు.
పార్టీ బలోపేతం కోసం గ్రామస్థాయి వరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.అలాగే రాబోయే అన్ని ఎన్నికల్లో కలిసి కట్టుగా ఉంది విజయమే లక్ష్యం గా అడుగుకు వేయాలని సూచించారు.
అలాగే గత 10 సంవత్సరాల కష్ట కాలంలో జిల్లా పార్టీ కి అండగా ఉంటూ అధికారమే లక్ష్యంగా పెట్టుకొని సేవలందించిన మనాల మోహన్ రెడ్డి, నూడ చైర్మన్ కేశ వేణు లను అభినందించారు.
నిజామాబాద్ కాంగ్రెస్లో నూతన శకం:..
జిల్లాలో కాంగ్రెస్ను మరింత బలోపేతం చేస్తాం’ – కాట్పల్లి నాగేష్ రెడ్డి
జిల్లాలోని క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తాననీ నగేష్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రతి గడపకూ కాంగ్రెస్ పార్టీ సందేశాన్ని, ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలవుతున్న సంక్షేమ పథకాలను తీసుకెళ్తామన్నారు .అలాగే రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని,అలాగే జిల్లా పరిషత్ స్థానం కైవసం చేసుకుంటామని పేర్కొన్నారు.
అందరి ఆశీస్సులతోనే తనకు జిల్లా అధ్యక్ష పదవీ బాధ్యతలు దక్కాయని ఆయన పేర్కొన్నారు. ఏఐసీసీ, పీసీసీ నాయకత్వానికి, జిల్లాలోని సీనియర్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ..రాబోయే మున్సిపల్ ఎనికల్లో మేయర్ సీటు కైవసం చేసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే నగరంలో పార్టీని మరింత బలోపేతం చేసి, ముఖ్యంగా యువత విద్యార్థులను పార్టీలోకి ఆకర్షించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.నగర సమస్యలపై పోరాటాలను ఉధృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్ రెడ్డి, షబ్బీర్ అలీ,మండవ వెంకటేశ్వర రావు,అరికెల నర్సారెడ్డి, మనాల మోహన్ రెడ్డి, కేశ వేణు,ఆకుల లలిత, నరాల రత్నాకర్ జిల్లా కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
