HomeTelanganaNizamabadవిద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి ..ధర్నాకు మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్...

విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగుల డిమాండ్లను నెరవేర్చాలి ..ధర్నాకు మద్దతు తెలిపిన అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా…

విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చాల్సిందేనని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ చేపట్టిన ధర్నాకు మంగళవారం మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉద్యోగులు కొత్త డిమాండ్లను ఏమి అడగడం లేదని పాత వాటిని అమలుపరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రధానంగా విద్యార్హతను బట్టి ప్రమోషన్లు కల్పించాలన్నారు. అలాగే రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగా బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒకే సంస్థ ఒకే రూల్ ఉండే విధంగా చూడాలన్నారు. పని దినాలను తగ్గించి న్యాయం చేయాలన్నారు. గత ఏడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ధర్నా చేస్తున్నా…ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదన్నారు. * ఉద్యోగులకు మద్దతుగా తన వంతుగా లేఖను అందజేస్తానని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, విద్యుత్ శాఖామంత్రి బట్టి విక్రమార్క కు వచ్చే మూడు రోజుల్లో లేఖను అందజేస్తానని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రతినిధులు గంగాధ ర్ రవి షాదుల్లా సతీష్, బిజెపి కార్పొరేటర్లు జగదీష్ కులకర్ణి, మఠం పవన్, కల్పే అర్చనా చిరంజీవి, ఇప్పకాయల సుమిత్ర కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments