14వ వార్షికోత్సవ వేడుకల్లో నూడా ఛైర్మన్ కేశవేణు నేడు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలను రాజీవ్ గాంధీ ఆడిటోరియం నందు ఘనంగా నిర్వహించారుఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నూడా ఛైర్మన్ కేశవేణు మరియు యూవి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్, సుజాత సుర్యరాజ్, లక్కంపల్లి సంజీవరావు వాల బాలకిషన్ పాల్గోని ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు
అనంతరం నూడా ఛైర్మన్ కేశవేణు మాట్లాడుతూ నిరంతర నిర్విరామ నిస్వార్థ నిష్కలంక సేవలతో సమాజాన్ని జాగృతం చేస్తున్న ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షులు సాయిబాబు సారథ్యం వారి సేవలు నిరూపమానమని అన్నారు
అలాగే ఇందూరు యువత మెదలైన సందర్భంలో మెదటి కార్యక్రమంలో పాల్గొన్న సందర్బ ప్రస్థానాన్ని దగ్గర నుంచి చూసానని అప్పటినుండి ఇప్పటిదాకా నిరంతరంగా నిరుపమానంగా సాగుతున్న ఇందూరు యువత సేవలు అనన్యం అసామాన్యం అని 14 సంవత్సరాలుగా నిత్యం ఆకలి గున్న కడుపులకి అన్నాన్ని అందిస్తూ ఆకలిని తీర్చడం అనితర సాధ్యమన్నారు
ఈ కార్యక్రమంలో ఆత్మీయ అతిథిగా విచ్చేసిన తెలంగాణ ఉద్యమకారులు గైని గంగారం మాట్లాడుతూ ఇందూరు యువత సేవా ప్రస్థానంలో 14 ఏండ్లుగా తాను భాగస్వామినై ఉండటం ఆనందంగా ఉందన్నారు విరి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు అలాగే యూవి ఫౌండేషన్ ఫౌండర్ సృజన్ మాట్లాడుతూ ఇందూరు యువత చేసే సేవల్లో అనాధ శవాలకు అంతిమ సంస్కారాలు చేయడం సాయి యొక్క హృదయ సంస్కారానికి గొప్ప గుర్తింపు అన్నారు
ఎవరు పట్టించుకోకుండా దీనావస్థలో ఎక్కడో పడి ఉండి సమాజం చీదరించుకుంటున్నటువంటి అభాగ్యులు ఎవరికి తెలియకుండా మరణించినప్పుడు వారి శవాలని దూరం నుంచి కూడా చూడ్డానికి ఇష్టపడని సమాజం అలాంటి సందర్భాలలో అనాధ శవాలకి అంతమ సంస్కారాలు నిర్వహించడం అనన్య సామాన్యమన్నారు
అంతే కాకుండా చనిపోయిన వారందరినీ గుర్తు చేసుకుంటూ కాశీలో వారికి పిండ ప్రదానం చేయడం వారికి తలనీలాలు సమర్పించుకోవడం ఒక కొడుకు తన బాధ్యతను సాయిబాబు మరియు అతని మిత్రులు చేయడం అనేది ఎవరికి సాధ్యం కానీ సేవలని అన్నారు ఇలాంటి కార్యక్రమాలకి తనవంతు సహకారం అందింస్తాన్నారు
ఈ సందర్భంగా ఇందూరు యువత వ్యవస్థాపక అధ్యక్షుడు ముద్దుకూరి సాయిబాబు మాట్లాడుతూ తాను చనిపోయేంతవరకు ఈ సేవలను ఇలాగే ఇంకా ఉధృతంగా కొనసాగిస్తానన్నారు ఒకవేళ తాను ఈ సేవా మార్గంలో ఎప్పుడైనా మరణిస్తే తనమీద జాతీయ జెండాను కప్పాలని ఉద్విగ్నంగా కోరారు దీనికి రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారంతా అందరూ లేచి నిలబడి సైన్యాభినందించారు
ఆయన మాట్లాడుతున్నంతసేపు ప్రతి ఒక్కరు కన్నిరును కార్చారు మరియు ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అలాగే లైన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ సంస్కృతి ద్వారా సేవా కార్యక్రమాలు కోనసాగించేలా జి.ఆర్ సుజాత సుర్యరాజ్ ఆర్థిక సహకారం అందచేసారు వివిధ పాఠశాలలైన విశ్వవికాస్ హైస్కూల్,కిట్స్ ఫ్యూచర్ స్కూల్, హోలిమేరిహైస్కూల్ , శ్రీ నటరాజ కళాక్షేత్రం విద్యార్థులు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను ఆకట్టుకున్నాయి
ఈ కార్యక్రమంలో ఇందూరు యువత ప్రతినిధులు మద్ది గంగాధర్, చందా జగన్ మోహన్,దర్శనం రాజు,డా.కాసర్ల నరేష్ రావ్, రాజేష్ శర్మ, సూజాత రెడ్డి, పుష్పవతి, బోడ హన్మండ్లు, రాజు, శ్రీలత మరియు ఎస్.ఎస్.ఆర్ జూనియర్ కాలేజ్, యూ.వి కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, సత్య వొకేషనల్ జూనియర్ కాలేజ్ విద్యార్దులు అధ్యాపకులు తదితరులు పాల్గోన్నారు
