పహాల్గమ్ దాడి కి మోడీ దీటైన జవాబు ఇవ్వబోతున్నారని ఎంపీ అర్వింద్ అన్నారు అందులో ఏ మాత్రం సంశయం అక్కరలేదని తీవ్రవాద పీడ శాశ్వతంగావిరగడయ్యేలా మోడీ యాక్షన్ ఉండబోతుందన్నారు
ఓటు బ్యాంకు రాజకీయాలకు కోసం దేశభద్రతకు ముప్పు వచ్చేలా చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే నని ఎంపీ అర్వింద్ ధ్వజమెత్తారు ఆయన సోమవారం జక్రాన్ పల్లి లోని మనోరాబాద్ లో రైతు సంఘాలు ఏర్పాటు చేసిన పసుపు శుద్ధి కర్మాగారం ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడారు. పహాల్గమ్ ఉగ్ర దాడి తరవాత ఆయా రాష్ట్రాల్లోఉన్న అక్రమ వలసదారుల జాబితా ను కేంద్రం విడుదల చేస్తూ వారందరిని ఏప్రిల్ నెలఖారు లోగ వెళ్ళగొట్టాలని రాష్ట్ర ప్రబుత్వాలను ఆదేశించింది.బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏరివేత పూర్తీ కాగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వెళ్లగొట్టడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.
దేశంలో ఉగ్రవాదం ను పెంచిపోషించిన కాంగ్రెస్ వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పయేలా చేసిందన్నారు.కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతు పక్ష పాతిగా ఉందని మొదటి ఎన్నికల్లో ఎంపీ గా పోటీ చేస్తే.
178 పసుపు రైతులు పోటీ చేసి 96 వేల వోట్లు సాధించారని ఆ వోట్లమరుసటి ఎన్నికల్లో తనకు వచ్చేలా పని చేసానని వ్యయ ప్రయాసలు పడి పట్టుదల తో బోర్డు సాధించానని రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు బోర్డు వల్ల దక్కబోతున్నాయని అర్వింద్ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ రాకేష్ రెడ్డి బోర్డు ఛైర్మెన్ పల్లె గంగా రెడ్డి లు పాల్గొన్నారు
