HomeTelanganaNizamabadజిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ........డిచ్ పల్లి ఆర్మూర్ బోధన్ లో ఏర్పాటు...

జిల్లాలో మూడు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ……..డిచ్ పల్లి ఆర్మూర్ బోధన్ లో ఏర్పాటు కానున్న సంస్థలు ………ఒక్కో స్కూల్ కు రూ 200 కోట్లు ……..మరోదఫా లో మిగితా సెగ్మెంట్ లలో

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ జిల్లాలో మూడు ఏర్పాటు కానున్నాయి.

ఈ మేరకు ఈ స్కూల్స్ నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వ్యూలు ఇచ్చింది. జిల్లాలో ఆర్మూర్ డిచ్ పల్లి ,బోధన్ సెగ్మెంట్ లలో ఈ సంస్థలు అందుబాటు లోకి రానున్నాయి. గత బిఆర్ యస్ ప్రభుత్వం ఒక్కో నియోజకవర్గానికి ఒకటి చొప్పున గురుకుల విద్యా సంస్థలను ఏర్పాటు చేసింది.

ఇప్పుడు ఆ విద్యాసంస్థల నిర్వహణ పూర్తిగా గాడి తప్పింది. ప్రభుత్వ ప్రతిష్టే మసక బారుతుంది. వీటి నిర్వహణ మరింత మెరుగు పరచడానికే కనీస కార్యాచరణ లేని సర్కార్ యాంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను తెరమీదికి తెచ్చింది.

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకే రేవంత్ సర్కార్ ఈ స్కూల్స్ ను అందుబాటు లోకి తేవడానికి సిద్ధం అవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం వంద యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ ప్రమాణాలతో బిల్డింగ్స్ నిర్మించేందుకు డిజైన్ ఫైనల్ చేశారు.

డిజిటల్ విద్యాబోధన చేసేందుకు అనువైన క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, లైబ్రరీ, మినియాప్ థియేటర్ తోపాటు విశాలమైన క్రీడా మైదానాన్ని నిర్మిస్తున్నారు. అక్కడే టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు కాంప్లెక్స్ ను నిర్మించనున్నారు.

వీటన్నింటి కోసం ఒక్కో స్కూల్ నిర్మాణానికి సుమారు రూ. 200 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఈ మేరకు నిధులు మంజూరు చేసారు. స్కూల్స్ కోసం ఆయా నియోజకవర్గాల్లో ఉన్న ఫలంగా ప్రభుత్వ భూములను గుర్తించి సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

విద్యా సంస్థల ప్రాంగణాలు నిర్వహణ బోధనా ప్రమాణాలు పూర్తిగా కార్పొరేట్ స్థాయి లోనే వుండేలా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments