అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నిర్మల్ జిల్లా ఆధ్వర్యంలో తలపెట్టిన ఛలో బాసర త్రిబుల్ ఐటీ ఆందోళన ఉద్రిక్తంగా మారింది. సమస్యల కోసం త్రిబుల్ ఐటీ క్యాంపస్ మెయిన్ గేట్ ని నాయకులు ముట్టడించారు.
ఈ సందర్భంగా ఇందుర్ విభాగ్ కన్వీనర్ కైరి శశిధర్ మాట్లాడుతూ.నిర్మల్ జిల్లాలోని చదువుల తల్లి సరస్వతికి నిలమైన బాసరలో ఉన్నటువంటి త్రిబుల్ ఐటీ యూనివర్సిటీలో నీ విద్యార్థులు రెండు రోజులపాటు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు
వారికి ఉన్నటువంటి 17 రకాల సమస్యల గురించి దాదాపు 2000 వేల మంది విద్యార్థులు నిరసన తెలుపుతున్న విద్యార్థులకు ఏబీవీపీ మద్దతుగా ఈరోజు బాసర త్రిబుల్ ఐటీ యూనివర్సిటీ మెయిన్ గేట్ ముట్టడించడం జరిగింది
వెంటనే బాసరలోనీ ఐఐటి లొ ఉన్నటువంటి వేసిన తొలగించి రెగ్యులర్ గా ఉండే విసిని నియమించాలి విద్యార్థుల సమస్యలు పట్టించుకోనటువంటి విసి నీ వెంటనే తొలగించి రెగ్యులర్ విసిని నియమించాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది
గత ప్రభుత్వము ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు బాసర విద్యార్థుల సమస్యల కోసం త్రిబుల్ ఐటీ క్యాంపస్ ని సందర్శించడం జరిగింది మరి ఇప్పుడు ఎందుకు విద్యార్థుల సమస్యల్ని పెడచౌనా పెడుతున్నారు ఎందుకని abvp ప్రశ్నిస్తుంది
వెంటనే బాసర త్రిబుల్ ఐటీ సమస్యలను పరిష్కరించి విద్యార్థులకు న్యాయం చేయాలని ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది.
లేనియెడల రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తుంది అని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి సాయి కిరణ్, బోయిడి ఆకాష్, దినేష్ అజయ్,బోజన్న , ప్రణయ్,దేవదాస్, సాయి,మున్న,గణేష్,మహేష్,అక్షయ్,సాయికుమార్,పవన్ తదితరులు పాల్గొన్నారు




