44వ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటన డిచ్పల్లి మండల పరిధిలోని నాగపూర్ గేట్ చౌరస్తా సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జక్రాన్పల్లి నుంచి బుల్లెట్ బైక్పై వెళ్తుండగా, వేగంగా వచ్చిన కారు వారిని బలంగా ఢీకొట్టింది.
ఈ ధాటికి బైక్పై ఉన్న యువకులు రోడ్డుపై పడిపోగా, అదే సమయంలో అటుగా నాగపూర్ వైపు వెళ్తున్న గుర్తుతెలియని లారీ వారిపై నుంచి దూసుకెళ్లింది.
ఈ ఘటనలో బైక్ నుజ్జునుజ్జు కాగా, యువకులు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న వెంటనే డిచ్పల్లి సీఐ వినోద్, ఎస్సై షరీఫ్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
