HomeCRIME11 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి

11 మంది ఏఎస్సైలకు ఎస్సైలుగా పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 11 మంది అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్లకు (ఏఎస్సై) సబ్‌ఇన్‌స్పెక్టర్లుగా (ఎస్సై) పదోన్నతులు లభించాయి. పదోన్నతి పొందిన అధికారులు గురువారం పోలీస్ కమిషనర్ సాయి చైతన్యను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలకు మరింత సమర్థవంతమైన సేవలు అందిస్తూ శాఖ ప్రతిష్ఠను నిలబెట్టాలని సూచించారు.

చాలా కాలంగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న సిబ్బందికి అవకాశం రావడం పట్ల పోలీసు శాఖలో ఆనందం వ్యక్తమైంది.పదోన్నతి పొందినవారిలో మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన బి. జాన్సన్, వేల్పూర్‌కు చెందిన జి. రాజేశ్వర్‌రెడ్డి, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన వి. అనిల్‌కుమార్, శ్రీనివాస్‌రెడ్డి, టౌన్-2కు చెందిన బి. సాయిలు, టౌన్-4కు చెందిన ఎం.డి. లాయక్ అలీ, టౌన్-1కు చెందిన డి. చిన్న గంగారం, నవీపేట్‌కు చెందిన ఎస్.కె. గఫర్, బోధన్ టౌన్‌కు చెందిన కె. బాబురావు, జక్రన్‌పల్లికి చెందిన పి. శంకర్, రుద్రూర్‌కు చెందిన రేణుకాదేవి ఉన్నారు. వీరంతా ఏఎస్సైలుగా విధులు నిర్వహిస్తూ ఎస్సైలుగా పదోన్నతి పొందారు.ఈ సందర్భంగా సహచర అధికారులు, సిబ్బంది వారికి శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments