ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు ఇండిగా విమానం గత రాత్రి గాలి లోనే చక్కర్లు కొట్టడం కలకలం రేపింది ఢిల్లీ నుంచి బయలు దేరిన విమానం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకునే సమయానికి ఏటీఎఫ్ నుంచి క్లియరెన్స్ రాలేదు. దీంతో విమానాన్ని రన్ వే పై ల్యాండింగ్ చేసినట్లే చేసి.. పైలట్ మళ్లీ టేకాఫ్ తీసుకున్నారు.
20 నిమిషాల పాటు విమానం గాల్లో చక్కర్లు కొట్టి.. ల్యాండ్ అయింది. ఆ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి సహా విమానంలో 229 మంది ప్రయాణికులు ఉన్నారు.
చాలా సేపు గాల్లో చక్కర్లు కొట్టడంతో అందరూ కంగారు పడ్డారు. పైగా విమానంలో సీఎం కూడా ఉండటంతో ఏం జరుగుతుందోనని అందరూ బిక్కు బిక్కుమంటూ ఉన్నారు
