నిమ్స్ అడిషనల్ సూపరెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీభాస్కర్ ఇంట్లో మంగళవారం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పిర్యాదుల మేరకు కేసు నమోదు చేసిన ఏసీబీ మంగళవారం ఉదయం ఏకకాలంలో సోదాలు చేసింది .
హైదరాబాద్‌తో పాటు మూడు జిల్లాల్లో మొత్తం 12 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు సోదాలు చేపట్టాయి.లక్ష్మీభాస్కర్‌కు సంబంధించిన నివాసాలు, కార్యాలయాలు, ఇతర అనుబంధ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ఎర్రగడ్డలోని ఆయనకు చెందిన కల్పతరువు అపార్ట్‌మెంట్స్‌తో పాటు కుటుంబసభ్యులకు సంబంధించిన ప్రాంతాల్లోనూ సోదాలు కొనసాగుతున్నట్లు సమాచారం.
ఆస్తులకు సంబంధించిన పత్రాలు, బ్యాంకు లావాదేవీలు, డిపాజిట్లు తదితర వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాల్లో ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు
