HomeCRIMEఅనుమానాస్పద స్థితి లో యువతి మృతి .......పరారీ లో ప్రియుడు .........మాదాపూర్ హోటల్ గొడవ...

అనుమానాస్పద స్థితి లో యువతి మృతి …….పరారీ లో ప్రియుడు ………మాదాపూర్ హోటల్ గొడవ…

సై బరాబాద్‌ పోలీసు కమిషనరేట్ పరిధి మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓయో హోటల్ లో ఒక మహిళ అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. సిద్ధిఖీ నగర్ రోడ్డు ఓ యస్ ఎన్ ఎల్ టెర్మినస్’ ఓయో గదిలో ఈ ఘటన జరిగింది.

ఆమె తో పాటు వచ్చిన యువకుడు పరారీ లో ఉన్నాడు విశాఖపట్నంకు చెందిన షారన్ నిఖిత తన ప్రియుడు శ్రీనివాస రవి తేజతో కలిసి సోమవారం మధ్యాహ్నం నగరానికి చేరుకున్నారు . యాప్ ద్వారా హోటల్‌లోని రూమ్ నంబర్ 303లో ఇద్దరూ అద్దెకు దిగారు.తెల్లవారుజామున సుమారు 1 గంట సమయంలో కొండాపూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి కు .

షారన్ నిఖితను అత్యవసర చికిత్స నిమిత్తం ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ హోటల్ సిబ్బందితో కలిసి తీసుకువచ్చాడని, అయితే ఆసుపత్రికి తీసుకువచ్చే సమయానికే ఆమె మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించగా, మృతురాలి ముఖం, తలపై తీవ్రమైన గాయాలు, వాపులు ఉన్నట్లు గుర్తించారు.

ఈ క్రమంలో యువతి మృతి చెందినట్లు తెలియగానే ఆమె ప్రియుడు శ్రీనివాస రవి తేజ ఆసుపత్రి సిబ్బంది కంటపడకుండా అక్కడి నుంచి పరారయ్యాడు.మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments