పాతబస్తీలోని బహదూర్ పురా ఏరియా లో ట్యూషన్‌కు వెళ్లే ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ కత్తితో దాడికి దారితీసింది. ఒకే ట్యూషన్లో చదువుతున్న నిజామ్, మోబిన్ల మధ్య వ్యక్తిగత విభేదాల కారణంగా వాగ్వాదం చోటు చేసుకుంది.
ఆగ్రహానికి లోనైన నిజామ్ కత్తితో మోబిన్‌పై దాడి చేయడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు బాధితుడిని ఉస్మానియా జనరల్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
దాడి అనంతరం నిందితుడు నిజామ్ పరారయ్యాడు. . నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు
