సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు సస్యశ్యామలంగా కళకళలాడాలని ఆకాంక్షిస్తూ గోకుల్ గో సేవ సమితి ఆధ్వర్యంలో గురువారం నగరంలోని పెద్ద రామ్ మందిరంలో వరుణ యాగం, గోపూజలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నిర్వహించిన ఈ యాగంలో లోకకల్యాణం, ప్రజల ఆయురారోగ్యాలు, రాష్ట్ర సుభిక్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని యాగంలో పూర్ణాహుతి సమర్పించారు.
అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించి గోమాత ఆశీస్సులు, శ్రీరామచంద్రుని ఆశీస్సులు పొందారు. కార్యక్రమంలో “జై శ్రీరామ్”, “జై గోమాత” నినాదాలు మారుమోగాయి.
ఈ కార్యక్రమంలో గోకుల్ గో సేవ సమితి అధ్యక్షులు తొడుపునూరి రామ్మోహన్, కార్యదర్శి తొడుపునూరి శ్రీనివాస్, కోశాధికారి అరవపల్లి బాలశేఖర్, ఫౌండర్ సభ్యులు మాదాని శ్రీధర్, గందె రాజశేఖర్, నల్లా నగేష్, ఆనంపల్లి ప్రమోద్, మామిడి రమేష్, పాపిని సతీష్, శివరాత్రి సంతోష్, నీల బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.
