HomeTelanganakamareddyసింగీతం రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేత..663 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

సింగీతం రిజర్వాయర్ మూడు గేట్లు ఎత్తివేత..663 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని మహమ్మద్‌నగర్ మండల పరిధిలో ఉన్న సింగీతం రిజర్వాయర్‌కు ఎగువ ప్రాంతాల నుంచి 663 క్యూసెక్కుల నీరు చేరుతోంది.

ఇన్‌ఫ్లోకు అనుగుణంగా మూడు వరద గేట్లను ఎత్తి 663 క్యూసెక్కుల నీటిని నిజాంసాగర్ ఆయకట్టుకు విడుదల చేస్తున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. సాగునీటి లభ్యతపై ఆశలు చిగురించడంతో నిజాంసాగర్ ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదే తరహాలో వర్షాలు కొనసాగితే ఖరీఫ్ సాగుకు నీటి కొరత ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అవసరమైన చర్యలు చేపడుతున్నట్లు నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments