HomeCRIME13 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి

13 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న 13 మంది హెడ్ కానిస్టేబుళ్లకు పదోన్నతులు దక్కనున్నాయి. వీరికి ఏఎస్‌ఐ హోదా కల్పించేందుకు అవసరమైన కసరత్తును జిల్లా అధికారులు వేగవంతం చేశారు.

జోన్-2 బాసర డీఐజీ కార్యాలయం నుంచి అందిన ఆదేశాల మేరకు, అర్హులైన హెడ్ కానిస్టేబుళ్లను ఏఎస్‌ఐలుగా పదోన్నతి కల్పించే ప్రక్రియను కమిషనరేట్ చేపట్టింది.

ఈ క్రమంలో పదోన్నతి పొందుతున్న 13 మంది హెడ్ కానిస్టేబుళ్లు తమకు కేటాయించే జిల్లా విషయంలో మూడు ఆప్షన్లను అందించాలని ఉన్నతాధికారులు సూచించారు.పదోన్నతి కోసం ఎంపికైన వారిలో ఎస్. కైలాసపతి (వేల్పూర్ పీఎస్), బి. చందులాల్ (ట్రాఫిక్ పీఎస్), ఆర్. మోజిరామ్ (ఎన్ఐబి), బి. పండు (ముగ్పాల్ పీఎస్), బి. రాజు (టౌన్-5 పీఎస్), కె. శంకర్ (యడపల్లి పీఎస్), జి. లక్ష్మణ్ (ట్రాఫిక్ పీఎస్), జి. శ్రీనివాస్ (భీమ్గల్ పీఎస్), జివి. శంకర్ (వర్ని పీఎస్), ఎస్. గంగాధర్ రావు (నందిపేట పీఎస్), ఎ. ముత్తన్న (టాస్క్ ఫోర్స్), పి. రాజేశ్వర్ (డబ్ల్యూపీఎస్ నిజామాబాద్), పి. మోహన్ (సీసీఎస్, ఎన్జెడ్‌బి) ఉన్నారు.


ఈ నెల 18వ తేదీలోపు సంబంధిత అధికారులు వివరాలను జోనల్ కార్యాలయానికి అందజేయాలని కమిషనరేట్ స్పష్టం చేసింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments