HomeLaw and Orderఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతల స్వీకరణ

నిజామాబాద్ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్‌గా ఇటీవల పదోన్నతిపై నియమితులైన డి. అరుణ్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ కార్యాలయంలో ఆయనను ‘టీఎన్జీఓస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్’ ప్రతినిధులు, శాఖా సిబ్బంది ఘనంగా సత్కరించారు.

ఈ సన్మాన కార్యక్రమంలో టీఎన్జీఓస్ ఎక్సైజ్ సెంట్రల్ ఫోరమ్ కేంద్ర ఉపాధ్యక్షులు కె. అరుణ్ కుమార్, డీపీఈఓ కార్యాలయ ఏఏఓ వి. నరసయ్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నూతన అసిస్టెంట్ కమిషనర్ డి. అరుణ్ కుమార్‌కు పూలగుచ్ఛాలు అందజేసి అభినందించారు.

అనంతరం జరిగిన సమావేశంలో శాఖాపరమైన విధులు, పరిపాలనాంశాలపై వారు చర్చించారు. ప్రభుత్వ లక్ష్యాల సాధనలో, శాఖా పరమైన బాధ్యతల నిర్వహణలో సిబ్బంది అందరూ నిబద్ధతతో పనిచేయాలని, నూతన అధికారికి పూర్తి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో ఫోరమ్ మాజీ కార్యదర్శి ఎం. శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్లు ఎం. దేవేందర్, శేఖర్ రాజ్, రిజ్వాన్, సభ్యులు రాజు, నాగరాజు, రాణా, సబా, సాయిబాబా, సృజన తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments