ప్రభుత్వ పాఠశాలలోనీ మధ్యాహ్న భోజనం చేసి ఆహారం వికటించి 15 మంది విద్యార్థులు అస్వస్థత కు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలంలోని రైతునగర్ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం చోటు చేసుకుంది.
ఈ ఘటనలో 15 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. రోజూ మాదిరిగానే విద్యార్థులు పాఠశాలలోని మధ్యాహ్న భోజనం చేశారు. కొద్ది సేపటికి కొందరు విద్యార్థులు కడుపులో నొప్పి, వాంతులతో అవస్థ పడ్డారు.
మిగతా విద్యార్థుల సమాచారం మేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విద్యార్థులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.
