నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్)లో రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు మనోరమా హాస్పిటల్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ డా. శిరిపల్లి శ్రీనివాస్ 20 మాన్యువల్ బ్లడ్ ప్రెజర్ (బీపీ) యంత్రాలను విరాళంగా అందించారు.
మానవతా దృక్పథంతో చేపట్టిన ఈ సేవా కార్యక్రమంలో భాగంగా ఆసుపత్రికి అవసరమైన వైద్య పరికరాలను అందజేశారు.ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ డా. ఎల్. రాములు, డా. శిరిపల్లి శ్రీనివాస్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన పరికరాలను అందించడం ద్వారా రోగుల వైద్యసేవలకు సహకరించినందుకు ఆసుపత్రి యాజమాన్యం డా. శ్రీనివాస్‌ను అభినందించింది
