మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ ఎదుట ఎంఐఎం కార్పొరేటర్లు బ్యటయించారు. స్థానిక అంగడి బజార్ లో తమను రోడ్ల మీద నుంచి తొలగించి డీఎస్ కాంప్లెక్స్ లోకి తరలించడం కూరగాయల వ్యాపారులు గత కొద్దీ రోజులుగా ఆందోళన చేస్తున్నారు.
రోజువారి వ్యాపారాలు దెబ్బతింతున్నాయని యంఐయం నగరంలోని రోడు ప్రక్కన విధివ్యాపారాలకు విక్రయించుకునే విధంగా ఎజెండా తీసుకురావాలని డిమాండ్ చేశారు.
మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పార్కింగ్ లేకుండా మాల్స్, ఆసుపత్రులు, బడా వ్యాపార సంస్థలు ఉన్నాయని, అయితే ఆయా సంస్థలపై ఆయా శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, వారి ఖాతాదారులు, రోగులు రోడ్లపై వాహనాలను నిలిపివేస్తున్నారని పేర్కొన్నారు.
సంస్థలపై ఎటువంటి పటిష్ట చర్యలు తీసుకోకుండా సాధారణ ప్రజలు కూడా చాలా ఇ బ్బందులను ఎదుర్కొంటున్నారు.కాని అధికారులు వీధి వ్యాపారుల జీవనోపాధి హక్కును హరించే అధికారుల చర్యల కారణంగా వీధి వ్యాపారులను వారి వ్యాపార సమయాల్లో ఇబ్బంది పెడుతున్నారు.
ఈ విషయంలో నిజామాబాద్ అర్బన్ పట్టణ పరిధిలోని వీధి వ్యాపారులకు ఇబ్బంది కలగకుండా మున్సిపల్ & ట్రాఫిక్ పోలీసు అధికారులకు ఆదేశాలివ్వాలని టేబుల్ ఎజెండా పెట్టి తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా డిప్యూటీ మేయర్ సహా కార్పొరేటర్లను కోరారు.
దీంతో మేయర్ ఛాంబర్ ఎదుట పెద్ద పెద్ద నినాదాలతో నిరసన వ్యక్తం చేశారు.
