ఈ కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు, అనంతరం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రమటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించడం జరిగింది..
అర్బన్ హడ్ హక్ కమిటీ సభ్యులు అంబిక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో దుబ్బ ప్రాంతంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది..
ఈ కార్యక్రమంలో భాగంగా కన్వీనర్ దేగాం యదాగౌడ్ మాట్లాడుతూ..నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి దేశ రాజకీయాల పైన చెరగని ముద్ర వేశారని, పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లోనే అధికారం కొచ్చిన మొట్టమొదటి పార్టీ అని అన్నారు.
పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన మహనీయుడు, తెలుగువారి కీర్తిని ప్రపంచ నలుమూలలకు తీసుకెళ్లిన ఘనుడు నందమూరి తారకరామారావు గారిని అన్నారు.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి బాటన పడ్డాయని అన్నారు..
ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్, కల్లెడ గంగాధర్, దంతాల ఆనంద్, పాశుల రాజు, గోవర్ధన్ గౌడ్, శంకర్ ముదిరాజ్, లవంగ రాజు, గడ్డం ప్రభాకర్, మల్ల రెడ్డి, ఇప్పాలపల్లి విష్ణు, వేముల నాగేశ్వర్ రావు, గంగినే రాజేశ్వర్, శేఖర్, వెంకటేష్, బాలాజీ గౌడ్, యూసఫ్, బిందు, చిన్నమ్మ, రవి, శంకర్, కల్లేడ శ్రీను, రాషీద, తదితరులు పాల్గొన్నారు.
