అప్పుడే పుట్టిన నవజాత శిశువు మృతదేహం మురికి కాలువలో లభ్యమైంది. ఈ ఘటన నగరంలోని ఆరవ టౌన్ పరిధిలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళ్లితే నగరంలోకి భగత్ సింగ్ కాలనిలో మురికి కాలువలో శిశువు మృతదేహం కనిపించింది.
దీంతో స్థానికులు గమనించి స్థానికులు స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.సమాచారం తెలుసుకున్న ఆరవ టౌన్ ఎస్ఐ మహేష్ ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వివరాల కోసం ఆరా తీస్తున్నారు.
