బాన్స్ వాడ సెగ్మెంట్ కు ఉప ఎన్నిక అనివార్యం అయితే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గడ్డు రోజులు తప్పవా ? సర్వే సంస్థలు సైతం అదే స్పష్టం చేస్తున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ యస్ అభ్యర్థిగా నాలుగో సారి బరిలోకి గెలిచినా పోచారం శ్రీనివాస్ రెడ్డి కి ఉప ఎన్నిక లో గట్టెక్కడం అంత సులువేమి కాదని సీ-ప్యాక్ సంస్థ తెగేసి చెప్తుంది.
నిజానికి మొన్నటి ఎన్నికల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నా సరే కాంగ్రెస్ లో గ్రూప్ పోరు ఆయన కు కలిసి వచ్చింది. అందుకే ప్రతికూల పరిస్థితులను అధిగమించి ఎన్నికల్లో గెలిచారు కానీ బిఆర్ యస్ ప్రభుత్వ హయాంలో తిరుగులేని నేతగా ఉన్నారు క్యాబినెట్ మంత్రిగా ఐదేళ్లు స్పీకర్ మరో ఐదేళ్లు ఉన్న కానీ మూడో సారి గెలిచినా బిఆర్ యస్ సర్కార్ రాలేదు దీనితో నాలుగు మసాలా కే పార్టీ పిరాయించారు.
అధికారంలో ఉన్న కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు. కానీ పోచారం ఎంట్రీ తో కాంగ్రెస్ శ్రేణులే రగిలి పోతున్నాయి.మరో వైపు పోచారం కొట్టిన దెబ్బ తో ఆలస్యంగా కోలుకున్న బిఆర్ యస్ ఆ సెగ్మెంట్ లో బలమైన నేత కోసం వెతుకు తుంది. బాన్స్ వాడ సెగ్మెంట్ బిఆర్ యస్ నేతలతో కేటీఆర్ స్వయంగా భేటీ అయ్యారు.
బాన్స్ వాడ ఇంఛార్జిగా మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి కి బాధ్యత లు ఇవ్వాలని అధిష్టానం భావించింది. కానీ ఈ ఈమద్యే ఎమ్మెల్సీ కవిత బాన్స్ వాడ సెగ్మెంట్ లో సుడిగాలి పర్యటన చేశారు. ఆమె పర్యటన అనూహ్యంగా సక్సెస్ అయింది. ఓ రకంగా గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది.
బిఆర్ యస్ నుంచి గెలిచిన పోచారం కాంగ్రెస్ పార్టీ చేరడంతో బాన్స్ వాడ లో ఉప ఎన్నిక అనివార్యమని బిఆర్ యస్ ధీమా గా ఉంది . ఉప ఎన్నికలో పోచారం ను ఓడించే వ్యూహంలో ఆపార్టీ ఉంది. బిఆర్ యస్ నుంచి గెలిచి కాంగ్రెస్ కు వెళ్లిన మరో తొమ్మిదు సెగ్మెంట్ లలో ఉప ఎన్నికల కోసం బిఆర్ యస్ న్యాయ పోరాటం చేస్తుంది తాజాగా సుప్రీం కోర్టు తలుపు తట్టింది. సీఎం రేవంత్ సైతం ఉప ఎన్నిక అనివార్యం అయితే అనుసరించాలిన్స వ్యూహం ఫై ఢిల్లీ పెద్దలతోనూ మాట్లాడి నట్లుగా చెప్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రఖ్యాత సర్వే సంస్థ సీ ఓటర్ పది సెగ్మెంట్ లలో తాజా పరిస్థితుల మీద సర్వే చేసింది ఆ సర్వే నివేదిక ప్రకారం ఉప ఎన్నికలు వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్‌కు చెరో నాలుగు స్థానాలు దక్కనున్నయని వెల్లడైంది. మరో రెండు స్థానాల్లో గట్టి పోటీ ఉండబోతుందని అంచనా వేసింది భద్రాచలం, గద్వాల్, పటాన్‌చెరు, శేరిలింగంపల్లి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ, చేవెళ్ల, స్టేషన్ ఘన్‌పూర్, బాన్సువాడ, జగిత్యాలలో బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఇక ఖైరతాబాద్,రాజేంద్రనగర్‌లో గట్టి పోటీ ఉండబోతున్నదని తేల్చింది. ఈ సర్వే అంచనాలను ట్విట్టర్ హ్యాంటిల్‌లో ఆ సంస్థ పోస్టు షేర్ చేసింది. అయితే ఈ సర్వేలో మాత్రం బీజేపీ తాజా బలం ఫై ఎలాంటి అంచనాలు వేయలేక పోయింది .
