ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా బకాయి పడ్డ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను విడుదల చెయ్యకపోతే కాలేజీల నిర్వహణ తమతో అవ్వడం లేదని కళాశాలల యాజమాన్యాలు వైస్ ఛాన్సలర్ గారి దగ్గర మొరపెట్టుకున్నాయి….
“ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాని పక్షంలో కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మరియు పీజీ కళాశాలల యాజమాన్యాలు.
వేల మంది విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పిన తమకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చెయ్యకుండా ప్రభుత్వం జాప్యం చెయ్యడం న్యాయం కాదని అన్నారు.
గత సంవత్సర కాలం నుండి సిబ్బంది జీతభత్యాలు కూడ చెల్లించలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తంచేశారు.భవనాల అద్దెలు కూడ చెల్లించలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ప్రభుత్వ దృష్టికి తమ సమస్యలను తీసుకు వెళ్లారని వీసీ గారికి విన్నవించారు.
ఈ కార్యక్రమంలో ప్రైవేటు డిగ్రీ కళాశాలల అసోసియేషన్ అధ్యక్షులు హరిప్రసాద్, కార్యదర్శి సంజీవ్, మారయ్య గౌడ్, శంకర్, నరాల సుధాకర్, జైపాల్ రెడ్డి, బాలాజీ, గిరి, శ్రీనివాస్, సుజన్ రెడ్డి, శ్రీమతి మలేహ, దుష్యంత్, రమణ, శ్రీనివాస్ రెడ్డి, శివాజీ, నవీన్, హరికృష్ణ సాయిబాబ తదితరులు పాల్గొన్నారు
