HomeTelanganaNizamabadమరో సారి బీజేపీ పగ్గాలు దినేష్ కేనా ? ......చివరి దశ కు సంస్థాగత ఎన్నికల...

మరో సారి బీజేపీ పగ్గాలు దినేష్ కేనా ? ……చివరి దశ కు సంస్థాగత ఎన్నికల పక్రియ

బీజేపీ లో సంస్థాగత ఎన్నికల పక్రియ దాదాపు చివరి దశకు వచ్చింది. మండల కమిటీ ల ఎన్నిక ను పూర్తీ చేసిన ఆపార్టీ జిల్లా అధ్యక్ష ఎన్నిక పక్రియ ను ఈ నెలఖారు లో పూర్తీ చేయడానికి ఏర్పాట్లు చేస్తుంది. ఎంపీ అర్వింద్ ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ జిల్లా విషయంలో అధిష్టానం స్పెషల్ ఫోకస్ పెట్టింది.

దాదాపు 75 శాతం మేరకు మండల కమిటీ లనియామకం పూర్తీ అయినందున పార్టీ నియమావళి మేరకు జిల్లా అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించ వచ్చు. అందుకే జిల్లా అధ్యక్షుడి ఎన్నిక పక్రియ మొదలు పెట్టారు. సంస్థాగత ఎన్నికల ఇంచార్జి గా ఇద్దరు సీనియర్ నేతలను నియమించారు.

వారు ఇప్పటికే తమ కార్యాచరణ మొదలు పెట్టారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నికలో ఓటర్ లతో భేటీ లు అయ్యారు వారి అభిప్రాయాలను సేకరించారు. ఎంపీ ,ఎమ్మెల్యే లు ,సీనియర్ నేతలు. మాజీ ఎమ్మెల్యే లు మండల కమిటీ అధ్యక్షులు ఓటర్లు గా పరిగణిస్తారు. జిల్లా అధ్యక్షుడి విషయంలో వీరందరి అభిప్రాయాలను కమిటీ తెలుసుకుంది.

మెజార్టీ నేతలు ప్రస్తుతం ఉన్న దినేష్ కే మరో దఫా పగ్గాలు ఇవ్వాలని సూచించారు. లోకసభ ఎన్నికలకు ముందే ఆయన కు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారని అందుకు తగ్గట్టుగానే లోకసభ ఎన్నికల్లో సమర్తవంతంగా పనిచేశారనివారు పేర్కొన్నారు.

అందులోనూ ఎంపీ అర్వింద్ సైతం దినేష్ వైపే మొగ్గు చూపుతున్నారు మరో దఫా ఆయనే ఉండాలని అర్వింద్ భావిస్తున్నారు.స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి సానుకూల ఫలితాలు సాధించాలని పట్టుదలతో ఉన్న అర్వింద్ దినేష్ అయితే తన టాస్క్ మరింత సులువు అవుతుందని భావిస్తున్నారు.

అందుకే ఆయన కే మరోసారి అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఆర్మూర్ అర్బన్ ఎమ్మెల్యే లు సైతం దినేష్ వైపే మొగ్గు చూపారు. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు తీసుకోవడానికి సీనియర్ నేతలెవ్వరూ ముందుకు రాలేదు ఒకరిద్దరు ఆసక్తి ఉన్నా సరే అర్వింద్ ను కాదని వారెవ్వరూ అధ్యక్ష బరి లోకి దిగడానికే ముందుకే రాలేక పోయారు .

బోధన్ కు చెందిన శ్రీనివాస్ రావు ఒక్కరే ఆసక్తి చూపారు. కానీ అయన పేరు ను మాజీ ఎమ్మెల్యే ప్రతిపాదించారని చెపుతున్నారు. కానీ మిగితా నేతలెవ్వరూ ఆయన కు మద్దతు ఇవ్వలేదు. అందుకే మరోసారి జిల్లా అధ్యక్షుడిగా దినేష్ కులాచారి నియామకం కానున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments