నగరంలోని ఎండు గంజాయి విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకున్నట్లు ఎక్సైజ్ ఇనస్పెక్టర్ వెంకటేష్ తెలిపారు.ఆయన తెలిపిన వివరాల ప్రకారం..నగరంలోని బోర్గాం కామన్ వద్ద గంజాయి విక్రయిస్తున్న విశ్వసనీయ సమాచారం మేరకు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ చంద్రభాన్ నాయక్ ఆద్వర్యంలో దాడి నిర్వహించి బోర్గాం కామన్ వద్ద శ్రావణ్ అనే వ్యక్తిని పట్టుకొని అతని వద్ద నుంచి 530 గ్రాముల గంజాయి,ఒక సెల్ ఫోన్, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎన్ఫోర్స్మెంట్ సిఐ ఏ వెంకటేష్, ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, విష్ణు,అవినాష్,శ్యామ్, సాయికుమార్ పాల్గొన్నారు.
