నిజామాబాద్ నగరంలోని గంగస్థాన్ ఫేస్-2 ప్రాంతంలో సాగుతున్న పేకాట స్థావరంపై ‘చీతా ఫోర్స్’ పోలీసులు మెరుపుదాడి చేశారు. పోలీసుల రాకను పసిగట్టిన కొందరు పారిపోవడానికి ప్రయత్నించగా, మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడుల్లో నిందితుల నుంచి సుమారు రూ. 58 వేల నగదుతో పాటు రెండు కార్లు, ఒక బైక్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పేకాట సాగుతున్నట్లు అందిన పక్కా సమాచారంతో చీతా ఫోర్స్ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ తనిఖీల్లో తొమ్మిది మంది పట్టుబడగా, మరో ఇద్దరు పరారైనట్లు సమాచారం. ఈ క్రమంలో నిందితులపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
