మూడు మాసాలుగా ఖాళీగా ఉన్న నిజామాబాద్ కమిషనర్ ఎడతెగని కసరత్తు ఎట్టకేలకు కొలిక్కి వచ్చింది కమిషనర్ ఎవరనేది ప్రభుత్వ పెద్దలు ఖరారు చేశారు. అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఇద్దరీ పేర్లను కమిషనర్ కోసం సిఫార్స్ చేసారు.
దీనితో సీఎం ఎవరి వైపు మొగ్గు చూపలేక పోస్టింగ్ ను పక్కకు పెట్టేసారు. కానీ డైరెక్ట్ ఐపిఎస్ అధికారికే నిజమాబాద్ పోలీస్ కమిషనర్ గా నియమించాలని స్వయంగా సీఎం రేవంత్ స్పష్టం చేయడం తో సిరిసిల్ల ఎస్పీ గా పనిచేస్తున్న అఖిల్ మహాజన్ వైవు డీజీపీ మొగ్గు చూపారని ఆయనే పేరే సీఎం కు ప్రతిపాదించారు ఆయన పేరే దాదాపు ఖరారైనట్లు విశ్వసనీయ సమాచారం.
గత ఏడాది అక్టోబర్ నెలలో సిపి కల్మేశ్వర్ జాతీయ పోలీస్ కమిటీ కి బదిలీ అయ్యారు . సుమారు 100 రోజులుగా నిజామాబాద్ కు సీపీ లేకుండా ఇంచార్జీ సీపీ సింధు శర్మతోనే నెట్టుకొచ్చారు. తాజాగా సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ పేరు తెరమీదికి వచ్చింది. .
2017 ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అఖిల్ మహాజన్ ప్రస్తుతం సిరిసిల్ల ఎస్పీగా పనిచేస్తు న్నారు. అంతకుముందు మంచిర్యాల డీసీపీగా విధులు నిర్వర్తించారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా, కఠినంగా వుండే మహాజన్ మంచి ఐపీఎస్ అధికారిగా అనతికాలంలోనే పేరు తెచ్చుకున్నారు.
నిజామాబాద్ సీపీ కోసం మరో ఇద్దరు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్మల్ ఎస్పీగా పనిచేస్తున్న జానకీ షర్మిలా, గతంలో కామారెడ్డి ఎస్పీగా పనిచేసిన శ్వేతరెడ్డిలు ల కోసం అధికార పార్టీ దిగ్గజ నేతలు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేశారు .
కానీ ఐపీఎస్ ల పోస్టింగ్ ల విషయం లో ఎవ్వరు ఒత్తిడి తేవద్దని సీఎం జిల్లా అగ్ర నేతల కు నచ్చ జెప్పారని సమాచారం.సానుకూలంగా ఉండే వారికి కమిషనర్ గా నియమిస్తామని సీఎం భరోసా ఇచ్చారని తెల్సింది
