దోపిడీలు చేసే ముఠాలు బైకు లు ఎత్తుకెళ్లే కేడీ లను వేటాడి పోలీసులకు ఝలక్ ఇచ్చాడు ఓ దొంగ ! వాహనాల తనిఖీ చేయడానికి వెళ్లిన ఓ ఎస్సై వాహనం చోరీ అయిన ఘటన నగరంలో చోటు చేసుకుంది.
నిజామాబాద్ నగర ట్రాఫిక్ ఎస్సై రోజు వారి విధుల్లో భాగంగా మంగళవారం రూరల్ పోలీస్ స్టేషన్ పరిధి లో కంఠేశ్వర్ బైపాస్ రోడ్ లో రోడ్డు పక్కకే పోలీస్ శాఖ ను చెందిన తన బైక్ ను పార్క్ చేసి వాహనాల తనిఖీ చేసి జరిమానాలు విధించారు .
ఆయన తన విధుల్లో క్షణం తీరిక లేకుండా ఉండి పోయారు. విధులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో వచ్చి చుస్తే పార్క్ చేసిన బైకు మాయం అయింది. సమీప ప్రాంతాల్లో వెతికిన కనిపించలేదు చివరికి ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు
