ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా ‘ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ’ ఆధ్వర్యంలో వారాహి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.స్థానిక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి ప్రత్యేక వేదిక వద్ద వేదపండితులు మంత్రోచ్చారణల నడుమ పూజా కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపారు.
అనంతరం జరిగిన సామూహిక కుంకుమార్చనలో పెద్ద సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొని, భక్తిభావంతో అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించి తరించారు.ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షులు డాక్టర్ మద్దుకురి సాయిబాబుమాట్లాడుతూ.. “ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా గత కొంతకాలంగా తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించడం మా సంస్థ ఆనవాయితీగా పాటిస్తోంది.
సామాజిక సేవా కార్యక్రమాలతో పాటు, ఆధ్యాత్మికతను పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయి.
భవిష్యత్తులోనూ మరిన్ని సేవా, ఆధ్యాత్మిక కార్యక్రమాలను చేపడతాం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ కార్యవర్గ సభ్యులు, అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలను స్వీకరించారు.
