HomeCRIMEనకిలీ డాక్టర్ల దందా.. ప్రాణాలతో చెలగాటం!అర్హత లేకుండానే వైద్యం.. 8 క్లినిక్‌ల సీజ్తెలంగాణ మెడికల్ కౌన్సిల్...

నకిలీ డాక్టర్ల దందా.. ప్రాణాలతో చెలగాటం!అర్హత లేకుండానే వైద్యం.. 8 క్లినిక్‌ల సీజ్తెలంగాణ మెడికల్ కౌన్సిల్ దాడుల్లో గుట్టురట్టు

నిజామాబాద్‌లో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు.. నకిలీ వైద్యులపై ఉక్కుపాదంప్రాణాలను కాపాడాల్సిన వైద్యం.. కొందరు నకిలీ వైద్యుల చేతుల్లో ప్రాణాంతక వ్యాపారంగా మారింది.వైద్యం పేరుతో జిల్లాలో నకిలీ క్లినిక్‌ల దందా మూడు సూదులు ఆరు సెలన్ లు అన్న చందంగా సాగుతోంది.

అర్హతలు లేని వ్యక్తులు డాక్టర్ల అవతారం ఎత్తి అమాయకులను మోసం చేస్తుండగా, ఎనిమిది క్లినిక్‌ల సీజ్‌తో ఈ అక్రమనికి తెరలేచింది. ఎలాంటి వైద్య అర్హతలు లేకుండానే డాక్టర్లమంటూ క్లినిక్‌లు నడుపుతూ అమాయకుల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న వారి దందాపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఉక్కుపాదం మోపింది.

జిల్లాలో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో ఎనిమిది నకిలీ క్లినిక్‌ల గుట్టురట్టు చేసి, వాటిని సీజ్ చేయడంతో పాటు సంబంధిత పోలీస్ స్టేషన్లలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలు అనే తేడా లేకుండా నకిలీ వైద్యుల దందా రోజురోజుకూ విస్తరిస్తోంది. వైద్య పట్టాలు లేకపోయినా ఇంగ్లిష్ మెడిసిన్, ఆయుర్వేదం, హోమియోపతి వైద్యులమంటూ ప్రచారం చేసుకుంటూ ప్రజలను నమ్మిస్తున్నారు.

మరికొందరు సోషల్ మీడియాలో వీడియోలు విడుదల చేస్తూ “మా చికిత్సతో బీపీ, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు పూర్తిగా మాయమవుతాయి” అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రోగుల పరిస్థితిని ఆసరాగా చేసుకొని అవసరానికి మించి యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు, నొప్పి నివారణ మందులు ఇస్తూ వారి ఆరోగ్యాన్ని మరింత ప్రమాదంలోకి నెడుతున్నారు.

కొందరు నిబంధనలకు విరుద్ధంగా రక్త పరీక్షలు, ఇతర వైద్య పరీక్షలు కూడా నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆర్‌ఎంపీలు, పీఎంపీలు తమ పరిధిని దాటి చికిత్సలు చేయడం, గర్భవిచ్ఛిత్తులకు ప్రోత్సహించడం వంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ మెడికల్ కౌన్సిల్ బృందం నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించింది.

అర్హతలు లేకుండా వైద్యం చేస్తున్న ఎనిమిది మందిని గుర్తించి, వారి క్లినిక్‌లను సీజ్ చేసింది. సంబంధిత పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి తదుపరి చర్యలు ప్రారంభించారు.జిల్లాలో అర్హతలేని వైద్యుల క్లినిక్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడే ఎనిమిది క్లినిక్‌లు సీజ్ అయినప్పటికీ, ఇంకా అనేక ప్రాంతాల్లో ఇలాంటి నకిలీ ఆసుపత్రులు, ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు కొనసాగుతున్నట్లు సమాచారం.

జిల్లా యంత్రాంగం సమగ్ర తనిఖీలు చేపట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సీజ్ చేసిన క్లినిక్‌లు

చక్రవర్తి దవాఖాన, వీక్లీ బజార్ – వన్‌టౌన్ పీఎస్, ఎఫ్‌ఐఆర్ నం.237

శ్రీ రాజా ఫస్ట్ ఎయిడ్ సెంటర్ – మల్లెపుల్ల లింగా గౌడ్ – టూ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.101

రాజరాజేశ్వరి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ – బి.రాజు – ఫోర్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.227

సుచరిత హాస్పిటల్, నేలకల్ రోడ్ – డి.నారాయణ – ఫోర్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.235

దేవిప్రియ ఆయుర్వేద చికిత్సాలయం, కోటగల్లి – మేడిచెర్ల శ్రీనాథ్ – ఫోర్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.236

శ్రీ శ్రీనివాస ఫస్ట్ ఎయిడ్ సెంటర్, బిల్లా సాయిబాబా – ఫోర్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.234

హుడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్, మాలపల్లి – మహమ్మద్ ఆరిఫ్ – ఫిఫ్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.106

స్వాతి ఫస్ట్ ఎయిడ్ క్లినిక్ – అడ్లూరి రాజు – ఫిఫ్త్ టౌన్, ఎఫ్‌ఐఆర్ నం.105

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments