కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన కుల గణన వివరాలు అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రం లో బీసీల జనాభా 46.2 శాతమే ఉన్నట్లు చెబుతుండడంపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయనీ నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ద్వజమెత్తారు.
శుక్రవారం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర కుటుంబ, కుల గణన తప్పుల తడకగా ఉందని ఆరోపించారు.
ఈ మేరకు ప్రభుత్వం విడుదల చేసిన కుల గణన నివేదికను బిజెపి వ్యతిరేకిస్తోందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52 శాతం ఉన్నట్లు తేలిందన్నారు. పదేళ్ల తర్వాత బీసీ జనాభాను 46 శాతంగా చూపి కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
రాబోయే స్థానిక ఎన్నికల్లో నా బీసీ సోదరి, సోదరిమనుల ఓట్ల కోసం కాంగ్రెస్ చేసిన పెద్ద డ్రామా…గత ప్రభుత్వం లెక్కల ప్రకారం 1.85 కోట్ల పైగ అంటే 51% ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ లెక్కల ప్రకారం 1.65 కోట్లు అంటే 46.25% నిర్ణయించింది.
మరి దాదాపు 21 లక్షల బీసీలు ఏమైనారు , 10 ఏళ్ల నుండి బీసీలు ఏమైనా అంతరించిపోతున్నట్లు ప్రభుత్వం భావిస్తుందానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. బీసీ కులగనన పేరుతో మైనారిటీ వర్గాన్ని బీసీలో కలిపే కుట్ర చేసినట్లు మాకు అనుమానం వ్యక్తం చేశారు.
ప్రతి మండలంలో ఒక గురుకులం అన్నారు. దాని పురోగతి ఏంటి ప్రభుత్వం సమాధానం చెప్పాలనీ తెలిపారు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజ్ అన్నారు. సంవత్సరం గడిచిన వాటి ఊసే లేదను ఎద్దేవ చేశారు.
ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లో 2వ దశ గొర్ల పంపిణీ అంటిరి,గౌడన్నలకు 5 ఎకరాలు భూమి ఈత వనాల కోసం ఇస్తామన్నారు ఎంతమంది గౌడ కులస్తులకు ఇచ్చారని ప్రశ్నించారు., మాజీ కార్పొరేటర్లు మాస్టర్ శంకర్,సాయివర్ధన్,పంచారెడ్డి శ్రీధర్,బిజెపి నాయకులు పాల్గొన్నారు
