ప్రముఖుల(వీఐపీ) భద్రతపై ఇంటెలిజెన్స్ విభాగం కీలక నిర్ణయం తీసుకుంది. నక్సల్స్పూర్తిగా తగ్గడంతో హిట్ లిస్టు లో ప్రముఖులకు సెక్యూరిటీ తగ్గించడానికి సమాయత్తం అవుతుంది. దీంతో రాష్ట్రంలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత భారీగా తగ్గించడంతో గన్ మెన్ లను ప్రభుత్వం తొలగించబోతుంది.
ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే లకు పూర్తీ స్థాయిలో గన్ మెన్ లను తొలగించబోతున్నారు బిఆర్ యస్ కు చెందిన అనేక మంది ఎమ్మెల్యే లకు ఇంకా గన్ మెన్ లను వెంటేసుకొని నియోజకవర్గాల్లో హల్ చల్ చేస్తున్నారు అసలు వారికి ఎందుకు ఇంకా గన్ మెన్ లను కొనసాగిస్తున్నారనేది ఇటీవల కమిటీ సమావేశమై ఇంటెలిజెన్స్ ఎవరెవరికి పూర్తీ స్థాయిలో గన్ మెన్ లను తొలగించాలి
ఎవరికి భద్రత ను కుదించాలి అనేది అరా తీశారు అలాగే కొత్తగా ఎవరెవరికి భద్రత కల్పిం చాలి, ఎంత మేరకు కల్పించాలి అనేది నిర్ణయించిన ఇంటెలిజెన్స్ విభాగం.. భద్రత అవసరం లేని 100 మందికిపైగా మాజీ ప్రజా ప్రతినిధులు , మాజీ పోలీస్ ఉన్నతాధికారులకు గన్ మెన్ లను తొలగించింది.
ఇందులో భాగంగా పదవి విరమణ చేసిన డిజిపి అదనపు డీజీపీ ఐజి స్థాయి అధికారులకు సైతం భారీగా గన్ మెన్ లను తగ్గించడానికి రంగం సిద్ధం అయింది బిఆర్ యస్ నేత మాజీ ఐపిఎస్ ప్రవీణ్ కుమార్ గన్ మెన్ ను తొలగించడం ఫై ఆగ్రహం వ్యక్తం చేసారు
తనకు ఏదైనా హాని జరిగితే రేవంత్ బాధ్యత వహించాలన్నారు. అలాగే ఉత్తర తెలంగాణ జిల్లా లో ముఖ్యంగా ఉమ్మడి వరఁగల్ ఆదిలాబాద్ జిల్లాలో కొంత మంది అధికార పార్టీ కీలక నేతలకు భద్రత యధావిధిగా కొనసాగించే ఆలోచనలో ఉంది
