నందిపేటలో గోసంగి సంఘ భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్, జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డిని సంఘ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందజేశారు.
సంఘ భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించి సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజకవర్గ అధ్యక్షుడు గంధం గంగాధర్, బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి భూతం సాయిరెడ్డి, మారంపల్లి సర్పంచ్ ఆరే గంగాధర్, కృష్ణ, ముత్యంతో పాటు పలువురు పాల్గొన్నారు.
