నగరంలో డీసీఎం ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. నగరంలోని ఒకటవ టౌన్ పరిధిలో నీ బావర్చి హోటల్ సమీపంలో రోడ్డుపై వెళ్తున్న మహిళను డీసీఎం వాహనం ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. మృతురాలి వివరాలు, కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
